నయనతార బికినీ షో చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఆమె ఎప్పుడూ బికినీలో కనిపించలేదా? అంటే ఎందుకు లేదూ? ఆమె ఆల్రెడీ బిల్లా సినిమాలో నటించారు. తెలుగు సినిమా కాదు. తమిళంలో అజిత్ చేసిన బిల్లాలో నయన్ బికినీలో కనిపించారు. తెలుగు బిల్లాలో అనుష్క బికినీ వేసినట్టు అన్నమాట. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బికినీ ట్రై చేయబోతున్నారు నయనతార. రీసెంట్ టైమ్స్ లో పద్ధతైన పాత్రలు మాత్రమే చేస్తున్నారు నయన్. ఇప్పుడు జవాన్ మూవీ కోసం మళ్లీ గ్లామరస్‌గా కనిపించనున్నట్టు టాక్.
షారుఖ్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కీ సీన్‌లో నయనతార బికినీలో కనిపిస్తారని సమాచారం. నయన్‌తో పాటు దీపిక పదుకోన్ కూడా కీ రోల్ చేస్తున్నారు. ప్రియమణి కూడా ప్రామినెంట్ రోల్‌లో కనిపిస్తారు.
నయనతారకి నార్త్ లో ఇదే తొలి సినిమా. ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ గా ఉండాలని, నార్త్ లేడీస్‌కి తాను ఏమాత్రం తీసిపోకూడదని ఫిక్స్ అయ్యారు నయన్. అందుకు గ్లామర్ గేట్లు ఎత్తేయడానికి రెడీ అయ్యారన్నది కోలీవుడ్ టాక్.
పఠాన్ సినిమా సక్సెస్ జోరుమీదున్నారు షారుఖ్. ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కు దాటేసింది. ఇప్పుడు జవాన్ రెండు వేల కోట్లను దాటాలని తనకు తానే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట కింగ్ ఖాన్. పఠాన్ సినిమాను ఇండియాలో ఎనిమిది వేల స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇప్పుడు జవాన్‌ని 14 వేల స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందే అనుకున్న తేదీకి సినిమాను తీసుకురావడం మాత్రం జరగని పనే అంటున్నారు ప్రాజెక్ట్ ని దగ్గర నుంచి చూసిన వారు. అదే జరిగితే జవాన్ రిలీజ్ ఎప్పుడుంటుంది? ఏ సీజన్‌ని టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది. ఇప్పుడు షారుఖ్ ఉన్న జోరు చూస్తే ఆయన ఏ సీజన్‌లో వచ్చినా సరే, ఆ టైమ్‌కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న హీరోలు సైడ్ ఇవ్వాలనే అనుకుంటారు. అదే జరుగుతుందా? కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ముందుకు దూకుతారా? అనేది కూడా ఇంట్రస్టింగ్ విషయమే.